Skip to main content

Namaste NRI

జర్మనిలో మినీ మహానాడు వేడుకలు

జర్మనిలో మినీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక టిడిపి ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐర్లండ్ , నెదర్లాండ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుండి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు తరలివచ్చారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ,గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. టిడిపి ఎన్నారై జర్మని విభాగం వెబ్ సైట్ ని ఆవిష్కరించారు.

కుటుంబం కన్నా ప్రజలకే ఎన్టీఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని ఆయన కుమారుడుగా పుట్టడంతో తన అదృష్టం అని రామ కృష్ణ తెలిపారు. మాతృ భూమిని టిడిపిని మరిచిపోకుండా ప్రవాసాంధ్రులు వివిధ కార్యక్రమాలు నిర్వహించడంపై ఎమ్మెల్యే మాధవి హర్షం వ్యక్తం చేశారు. టిడిపి కార్యకర్తల పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన అంతం అయి రెండేళ్లు అయిందని మన్నవ సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా 46 రకాల తెలుగు వంటకాలతో అతిదులకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ బొల్ల, వంశీ దాసరి, వెంకట్ ఖండ్ర, శ్రీకాంత్ కుడితిపూడి, పవన్ కుర్ర తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events