Namaste NRI

క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ప్రారంభించిన మంత్రి వేముల

రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలంటే మధ్య తరగతి ప్రజలను అనుగుణంగా నిర్మాణాలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.  మాదాపూర్‌ హైటెక్స్‌లో జరిగిన క్రెడాయ్‌ ప్రాపర్టీ షో కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మ్యు అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లకాలం రియల్‌ ఇండస్ట్రీ బాగుండాలంటే మధ్య తరగతి ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిందేనని అన్నారు. రియల్టర్ల సమ్యలను సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకవెళ్తాననని హామీ ఇచ్చారు. తెలంగాణ హైదరాబాద్‌ బిల్డర్స్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రతినిధులు ప్రజలకు మంచి ప్రొడక్ట్స్‌ను అందుబాటులోకి తెచ్చారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగం దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు.

                రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ బాగున్నందునే అన్ని పరిశ్రమలు తరలివస్తున్నాయని తెలిపారు. ఐటీ పరిశ్రమ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. విద్యుత్‌ సమస్యను అధిగమించామని, దాంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 15 వేల ఐటీ కంపెనీలు కొత్తగా ఏర్పడ్డాయని తెలిపారు. హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకవెళుతున్నామని తెలిపారు. ఎస్‌ఆర్‌డీపీ కింద రహదారులు అభివృద్ధి చెందుతున్నాయని, రవాణా సౌకర్యం సులువు కావడంతో పరిశ్రమలు, రియల్‌, ఐటీ రంగాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. త్వరలో హైదరాబాద్‌ చుట్టూ ఆర్‌ఆర్‌ఆర్‌ రాబోతోందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు సాఫల్యమైతే రియల్‌ రంగం మరింత వృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో ల్యాండ్‌ సేకరణ 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. టీఎస్‌ బీపాస్‌ ద్వారా పరిశ్రమలకు పారదర్శకంగా అనుమతులు సత్వరమే వస్తున్నాయని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events