Skip to main content

Namaste NRI

జఫర్‌గడ్‌ పాఠశాలకు మిన్నెసోటా చేయూత 

జఫర్‌గడ్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ  ఉన్నత పాఠశాలకు మిన్నెసోట ఏరియా తెలంగాణా అసోషియేషన్‌ (మాట) సహకారంతో రూ.1 లక్షల విలువ చేసే ప్రింటర్‌, సైన్స్‌ పరికరాలు, క్రీడా సామాగ్రిని  అసోసియేషన్‌ అధ్యక్షుడు పున్న సురేశ్‌ ప్రధానోపాధ్యాయుడు గణేశ్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై బి మాధవ్‌ గౌడ్‌ హాజరై మాట్లాడారు. దాతల చేయూత, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని విద్యార్థులకు సూచించారు. మాట డైరెక్టర్‌ చాడా వినయ్‌  కుమార్‌ రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ పుష్పారాణి, ఉపాధ్యృాయులు పాల్గొన్నారు. 

Social Share Spread Message

Latest News