Namaste NRI

మిస్టర్‌ బచ్చన్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంచ్‌

Mayfair 40

రవితేజ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. హరీశ్‌శంకర్‌ దర్శకుడు. పీపుల్‌ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంచ్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు.. సంపద కాపాడేవాడు కూడా సైనికుడే అనే డైలాగుతో ఈ ట్రైలర్‌ మొదలైంది. ఆద్యంతం కమర్షియల్‌ అంశాలతో ట్రైలర్‌ సాగింది. రవితేజ పెర్ఫార్మెన్స్‌, ఎనర్జీ, చరిష్మా ఈ ట్రైలర్‌కి హైలైట్‌. జగపతిబాబు పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్నట్టు ట్రైలర్‌లో తెలుస్తున్నది. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ఈ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణ. సచిన్‌ ఖేడేకర్‌, సత్య, నెల్లూరు సుదర్శన్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: అయనంక బోస్‌, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సమర్పణ: పనోరమా స్టూడియోస్‌ అండ్‌ టి.సిరీస్‌.

Ixora 40
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events