రామ్-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్నసినిమా స్కంద. శ్రీలీల హీరోయిన్. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి పూర్తవుతూ వస్తున్నాయి. ఇక మేకర్స్ ఇప్పటి నుంచే ప్రమోషన్‌ల క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు.
స్కంద థియేట్రికల్ ట్రైలర్‌ని ఆగష్టు 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ప్రీ రిలీజ్ థండర్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇక గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ ట్రైలర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం స్కంద పై హైప్ భారీగా పెరుగుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15న తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.














