Skip to main content

Namaste NRI

బాబీ-మెగాస్టార్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్

దర్శకుడు కేఎస్‌ రవీంద్ర(బాబీ)తో మెగాస్టార్‌ చిరంజీవి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె.నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ ఈ నెల 21న ఘనంగా పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే తన పవర్‌ఫుల్‌ జిమ్‌ వీడియో ద్వారా రివీల్‌ చేశారు. ఆ వీడియోలో ఆయన చూపించిన డెడికేషన్‌, ఫిజికల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం ఆయన చేస్తున్న ఇంటెన్స్‌ వర్కవుట్స్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

గెట్టింగ్‌ రెడీ ఫర్‌ 158, బాబీ మే 21 ముహూర్తం కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ వారిది. అంటే ఇంకో నాలుగైదు రోజుల్లో కలుస్తున్నాం గెట్‌ రెడీ’ అంటూ ఈ వీడియోలో మెగాస్టార్‌ మాట్లాడారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్‌ పోస్టర్‌, లుక్‌ టెస్ట్‌ ఫొటో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ వీడియో అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.

Social Share Spread Message

Latest News