Skip to main content

Namaste NRI

మిస్టర్ ప్రెగ్నెంట్  నైజాం హక్కులను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్

సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా నటిస్తున్న మిస్టర్ ప్రెగ్నెంట్. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. ఇటీవల కింగ్ నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేసిన మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్,  పాటలు వంటి ప్రతి కంటెంట్ కూడా వారి ఆసక్తికి తగినట్లే ఉండి ఆకట్టుకుంటోంది.

 సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల కాబోతోంది. ఈ సినిమా నైజాం హక్కులను మంచి రేట్ కు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది. ఇలాంటి ఫేమస్ సంస్థ ద్వారా తమ సినిమా గ్రాండ్ గా విడుదలవుతుండటం మిస్టర్ ప్రెగ్నెంట్ టీమ్ లో సంతోషాన్ని కలిగిస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events