Skip to main content

Namaste NRI

మత్స్యకారుల కుటుంబాలను కలిసిన నాగ చైతన్య.. ఎందుకంటే ?

నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించబోతున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానుంది. మత్స్యకారుల కథాంశమిది. ఈ నేపథ్యంలో  హీరో నాగచైతన్య, దర్శకనిర్మాతలు చందు మొండేటి, బన్నీ వాసు శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ఓ మత్స్యకార గ్రామానికి వెళ్లి అక్కడి కుటుంబాలను కలిశారు.

2018లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథను తయారు చేశామని దర్శకుడు చందు మొండేటి పేర్కొన్నారు. మత్స్యకారుల గ్రామం నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమకథా చిత్రమిదని నిర్మాత బన్నీ వాసు తెలిపారు.  నాగచైతన్య మాట్లాడుతూ యథార్థ సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్న కథ ఇది. వినగానే స్ఫూర్తివంతంగా అనిపించింది. నా పాత్రలో సహజత్వం కనిపించాలంటే మత్స్యకారుల జీవితాలను ప్రత్యక్షంగా చూడాలనుకున్నా. అందుకే ఈ గ్రామానికి వచ్చాం అని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించబోతున్నారు.

Social Share Spread Message

Latest News