Namaste NRI

పాప్‌ కార్న్ ట్రైలర్‌ను విడుదల చేసిన నాగార్జున

అవికా గోర్‌, సాయి రోనక్‌ జంటగా నటిస్తున్న సినిమా పాప్‌ కార్న్.  ఎంఎస్‌ చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్‌, అవికా స్క్రీన్‌ క్రియేషన్స్‌ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్నారు. మురళి గంధం దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ చిత్ర ట్రైలర్‌ బాగుంది. లిఫ్టులో పిక్చరైజ్‌ చేసిన పాట ఆకట్టుకుంది. హీరో సాయి రోనక్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెబుతున్నా. అవికా గోర్‌ చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.ఆ సీరియల్‌ 128 దేశాల్లో అనువాదమైంది. ఆమె ఈ సినిమాతో నిర్మాతగా మారింది. కొత్త తరహా చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

ఎంఎస్‌ చలపతి రాజు మాట్లాడుతూ ఈ సినిమాకు కూడా మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నా అన్నారు. స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. పెద్దవాళ్లు సినిమా చూస్తూ తమ గతానికి వెళతారు. యువత సినిమాను ఆస్వాదిస్తారు అన్నారు. నాయిక అవికాగోర్‌ మాట్లాడుతూ ఈ సినిమాలో నటించి, నిర్మించడం గర్వంగా ఉంది. కొత్త కాన్సెప్ట్‌ మూవీ. సాంకేతికంగా సవాలు లాంటి చిత్రమిది. మీ అందరికీ నచ్చుతుంది  అన్నారు.  ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News