Skip to main content

Namaste NRI

నేపర్‌విల్‌ పబ్లిక్‌ లైబ్రరీ బోర్డు చైర్మన్‌గా భారత సంతతి వ్యక్తి 

అమెరికాలో అత్యంత ప్రముఖమైన నేపర్‌విల్‌ పబ్లిక్‌ లైబ్రరీ బోర్డు చైర్మన్‌గా భారత సంతతికి చెందిన ప్రముఖ సమాజ సేవకుడు అష్ఫక్‌ సయ్యద్‌ నియమితులయ్యారు. యూఎస్‌లో నంబర్‌ వన్‌ లైబ్రరీగా పేరొందిన నేపర్‌విల్‌కు తనను అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ లైబ్రరీ గత పదేండ్లుగా లక్ష నుంచి రెండున్నర లక్షల పాపులేషన్‌ క్యాటగిరిలో ఉంటూ దేశానికే గర్వకారణంగా నిలిచిందని చెప్పారు.హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ ఇదే లైబ్రరీ బోర్డులో ఈ ఏడాది మే వరకు ట్రస్టీగా సేవలందించారు.

Social Share Spread Message

Latest News