Skip to main content

Namaste NRI

ఖతర్‌లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఖతర్  తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ  నాయకులు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ సభ్యులు కేక్ కట్ చేసి లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గొట్టిపాటి రమణతో పాటూ ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్, ఖతర్ గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ మలిరెడ్డి సత్యనారాయణ, విక్రమ్ సుఖవాసి, రవిశంకర్, వెంకప్ప భాగవతుల తదితరులు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News