Skip to main content

Namaste NRI

నాటో కూటమీ కీలక ప్రకటన

ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచేందుకు సిద్దంగా ఉన్నట్లు నాటో కూటమి కీలక ప్రకటన చేసింది. యుద్ధం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగినా ఉక్రెయిన్‌కు దన్నుగా నిలుస్తామని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బెర్గ్‌ ప్రకటన చేశారు. నాటో ప్రమాణాలతో కూడిన ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించేందుకు కూటమి సమాయత్తం అవుతోందని ఆయన తెలియజేశారు. పాత సోవియట్‌ కాలం నాటి ఆయుధాల నుంచి ఆధునాతన పాశ్చాత్య మిలిటరీ పరికరాలు సమకూర్చే విషయంలో ఉక్రెయిన్‌కు సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీర్ఘకాలం సాయం అందించేందుకు సిద్ధంగా ఉండవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌`రష్యా యుద్ధం కొన్ని నెలల పాటు లేదా ఏళ్ల పాటు కొనసాగేందుకు కచ్చితంగా అవకాశాలు ఉన్నాయని స్టోల్టెన్‌బెర్గ్‌ అంచనా వేశారు.

Social Share Spread Message

Latest News