Namaste NRI

 ఫిలడెల్ఫియాలో నాట్స్ బాలల సంబరాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలడెల్ఫియాలో బాలల సంబరాలు నిర్వహించింది. ఫిలడెల్ఫియాలోని స్థానిక భారతీయ టెంపుల్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ బాలల సంబరాలు జరిగాయి. ప్రతి ఏటా పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినం సందర్భంగా నాట్స్ బాలల సంబరాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా వేడుకలను నిర్వహించింది. తెలుగు చిన్నారుల్లో ఉన్న ప్రతిభ పాటవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ బాలల సంబరాలకు అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 120 మందికి పైగా బాలబాలికలు ఈ సంబరాల్లో  ఉత్సాహంగా పాల్గొన్నారు.

నాట్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్స్ హరినాథ్ బుంగటావుల, సరోజ సాగరం, శ్రీనివాస్ సాగరం, రవి ఇంద్రకంటి, బాబు మేడి, రామకృష్ణ గొర్రెపాటి, పార్ధ మాదాల, అపర్ణ సాగరం, మాలిని గట్టు, సురేంద్ర ఈదర, మధు కొల్లి, సురేష్ బొందుగుల, మధు బూదాటి, సాయి సుదర్శన్ లింగుట్ల, లవ కుమార్ ఐనంపూడి, శ్రీకాంత్ చుండూరి, రమణ రాకోతు, ఈ బాలల సంబరాలు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు రామ్ నరేష్ కొమ్మనబోయిన, మురళి మేడిచెర్ల, బోర్డు సెక్రెటరీ శ్యామ్ నాళం, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి, తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు. నాట్స్ సంబరాలు కల్చరల్ టీం సభ్యులు బిందు యలంచిలి, శ్రీదేవి జాగర్లమూడి, శ్రీదేవి వేదగిరి, ఓం నక్క, కిరణ్ తవ్వ , టీఏజీడీవీ అధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ షేక్, మాజీ అధ్యక్షులు కిరణ్ కొత్తపల్లి, తదితరులు పాల్గొని వారి తోడ్పాటు అందించారు.

తెలుగు బాల బాలికలను ప్రోత్సహించడానికి, వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికే ఈ బాలల సంబరాలు కార్యక్రమమని నాట్స్ సంబరాలు కన్వీనర్ శ్రీధర్ అప్పసాని అన్నారు. బాలల సంబరాలను దిగ్విజయవంతంగా నిర్వహించిన నాట్స్ ఫిలడెల్ఫియా చాప్టర్ కార్యవర్గ సభ్యులందరికి ప్రత్యేక అభినందనలు తెలియ చేశారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంపట్ల నాట్స్ ఫిలడెల్ఫియా విభాగ సభ్యులకు నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News