Namaste NRI

ఆస్కార్‌ రేసులో నాటు నాటు 

అంతర్జాతీయ యవనికపై భారతీయ సినిమా వెలుగులీనే తరుణం ఆసన్నమైంది. ప్రపంచ సినిమాకే తలమానికంగా భావించే  ఆస్కార్‌ పురస్కారాల్లో పోటీపడే చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో నాలుగు భారతీయ సినిమాలు చోటు సంపాదించుకున్నాయి.  మొత్తం పది విభాగాలకుగానూ నాలుగింటిలో భారతీయ సినిమాలు స్థానం దక్కించుకోవడం విశేషం.  ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు చేసి పలు రికార్డులు స్పష్టించింది. ఇప్పుడు ఆస్కార్స్‌లోని బెస్ట్‌ ఓరిజినల్‌ సాంగ్‌ విభాగంలో పోటీ పడేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ లోని నాటు నాటు సాంగ్‌ షార్ట్‌ లిస్ట్‌ కావడం విశేషం. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో ఆల్‌ దట్‌ బ్రీత్స్‌, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ది ఎలిఫెంట్‌ విష్బరర్‌ ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో స్థానం పొందాయి.  ఈ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 81 పాటలు పోటీపడగా అందులో నుంచి 15 పాటలను అవార్డుల కమిటీ ఎంపిక చేసింది. అందులో నాటు నాటు పాటకి కూడా చోటు దక్కడం విశేషం.  ఈ 15 పాటల నుంచి కేవలం 5 పాటలు మాత్రం ఆస్కార్స్‌ అఫిషీయల్‌ నామినేషన్స్‌కి అర్హత సాధిస్తాయి.  95వ ఆస్కార్‌ అవార్డు ప్రదానోత్సవం వచ్చే ఏడాది మార్చి 12న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది.

Social Share Spread Message

Latest News