తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు, కథానాయిక నయనతారకు నిశ్చితార్థం జరిగింది. ఈ సంగతిని స్వయంగా నయనతార చెప్పడం విశేషం. విఘ్నేశ్‌తో ప్రేమ విషయమై ఇప్పటి వరకూ ఆమె నోరు విప్పింది లేదు. తొలిసారి ఓ తమిళ టీవీ ఛానల్ టాక్ షోలో ప్రేమ, నిశ్చితార్థం గురించి మాట్లాడారు. తన వేలికి ఉన్న ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ ఇది నా ఎంగేజ్‌మెంట్ రింగ్ అని నయనతార చెప్పారు. చాలారోజుల నుంచి ఆమె చేతికి ఉంగరం ఉంది. దీనిబట్టి నిశ్చితార్థం ఎప్పుడో జరిగి ఉండొచ్చు. త్వరలో విఘ్నేశ్, నయనతార పెళ్లి చేసుకోనున్నారని సమాచారం.
2015లో నానుమ్ రౌడీదాస్ సినిమా సమయంలో నయన్, విఘ్నేష్‌లు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విహారయాత్రలు ప్లాన్ చేస్తూ పనిలో పనిగా పలు దేశాలు కూడా చుట్టొచ్చేశారు. పండగలు, పుట్టిన రోజులు అన్నీ కలిపి సెలబ్రేట్ చేసుకున్న వీళ్లిద్దరూ మొత్తానికి ఒకంటివారవుతుండటంతో ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.