Skip to main content

Namaste NRI

నెల్సన్‌ మొదలైంది

జయంత్‌ను హీరోగా పరిచయం చేస్తూ సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వం వహిస్తున్న చిత్రం నెల్సన్‌. అనుషా రాయ్‌, సెహర్‌ కృష్ణన్‌ హీరోయిన్లు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ చిత్రం. ఉత్కంఠ రేకెత్తించే కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. స్టైలిష్‌ మేకింగ్‌తో దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దుతారు. రాజమండ్రిలో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. విశాఖపట్నం, హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తామని సినీ వర్గాలు తెలిపారు. సాయి సునీల్‌ మాట్లాడుతూ థ్రిల్లింగ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న చిత్రం నెల్సన్‌. ఉత్కంఠభరిత కథతో రూపొందిస్తున్నాం అన్నారు. ఆనంద చక్రపాణి, షాని, హరికృష్ణ చదలవాడ, పుష్ప ఫేమ్‌ రాజు, నవీనా రెడ్డి, రాజారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌ పట్నాయక్‌, కెమెరా: శివ దేవరకొండ. పాటలు : కాసర్ల శ్యామ్‌, నిర్మాత జయంత్‌ కార్తీక్‌.

Social Share Spread Message

Latest News