Skip to main content

Namaste NRI

ప్రేమికుల రోజు కానుకగా నిలవే రాబోతుంది

సౌమిత్‌ పోలాడి హీరోగా నటిస్తూ చిత్రం నిలవే. శ్రేయాసి సేన్‌ కథానాయిక. సాయి కె.వెన్నం దర్శకత్వం. రాజ్‌ అల్లాడ, గిరిధర్‌రావు పోలాడి, సాయి కె.వెన్నం నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్నది. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేయనున్నట్టు ఓ ప్రకటన ద్వారా మేకర్స్‌ తెలిపారు. ఎమోషన్స్‌తో కూడిన మ్యూజికల్‌ లవ్‌ డ్రామా ఇదని, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా సినిమా రూపొందుతున్నదని మేకర్స్‌ తెలిపారు. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, నీవన్‌ కుమార్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దిలీప్‌ కె.కుమార్‌, సంగీతం: కల్యాణ్‌ నాయక్‌, నిర్మాణం: పీవోవీ ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌.

Social Share Spread Message

Latest News