నార్వే అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ రాయల్ నార్వేయిన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ను ప్రధాని మోదీ అందుకున్నారు. మొదటిసారి తమ దేశానికి వచ్చిన భారత ప్రధాని మోదీని నార్వే కింగ్ హెరాల్డ్-5 దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించారు. నార్వే, మానవాళి శ్రేయస్సు కోసం విశిష్ట సేవలు అందించిన విదేశీయులు, నార్వే పౌరులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

ప్రధాని మోదీకి ఇది 32వ అంతర్జాతీయ పురస్కారం. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నార్వేలోని ఒస్లోలో అడుగుపెట్టారు. భారత ప్రధానికి నార్వే ప్రధాని జోనాస్ గాహ్ స్టోర్ సాదర స్వాగతం పలికారు. పహల్గాం ఉగ్రదాడి సమయంలో భారత్‌కు అండగా నిలబడ్డ నార్వేకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.





























