Namaste NRI

ఇటువంటి అవకావం అందరికీ రాదు : శశాంక్‌ యార్లగడ్డ

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) క్రీడా కార్యదర్శి శశాంక్‌ యార్లగడ్డ పదవి  విరమణ సమయంలో 2023 ఐసీసీ అండర్‌ ప్రపంచ మహిళా టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. పేద కుటుంబానికి చెందిన త్రిష గొంగడి క్రికెట్‌ ట్రైనింగ్‌, ఫిట్నెస్‌, ఆట పరికరాలు, ఆరోగ్యం తదితర అవసరాల నిమిత్తం శశాంక్‌ యార్లగడ్డని సంప్రదించడం తో తానా  తరపున ఫండ్రైజర్‌ మొదలు పెట్టి నిధుల సమీకరణ చేశారు. త్రిషకు ఒక కార్పోరేట్‌ సంస్థ నుంచి స్పాన్సర్షిప్‌ వచ్చింది. దీంతో తానా ఫండ్రైజర్‌ ద్వారా సేకరించిన నిధులతో త్రిష లాంటి ఇతర పేద క్రీడాకారులకు సహాయం చేయాలని నిర్ణయించారు.  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి రంజీలు, ఇతరత్రా క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆడుతున్న  9 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు.

ఆగస్టు 19న హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రోఫెషనల్‌ ఇంగ్లీస్‌ విల్లో బ్యాట్స్‌ అందించారు శశాంక్‌ యార్లగడ. సహాయం అందుకున్న వారిలో వైష్టవి యాదవ్‌ కుందెరపు, సహస్ర వెంకట్‌ శంకరి, శ్రీ అఖిలేష్‌ కొమ్ము, క్రాంతి రెడ్డి, సృజన ఎడ్ల, శశాంక్‌ కేవీ, మురళి అక్షిత్‌ జి,  షీమ షేక్‌, సుస్మిత ఉన్నారు. వీరందరిని శశాంక్‌ యార్లగడ్డ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ  TANANexGen   నినాదంతో ముందుకు నడిచిన తనకు NexGen  క్రికెట్‌ ఆణిముత్యాలను కలుసుకోవడం, సహాయం చేయగలగడం ఆనందంగా గౌరవంగా ఉందన్నారు. ఇటువంటి అవకాశం అందరికీ రాదన్నారు.

శశాంక్‌ యార్లగడ్డ గత రెండు సంవత్సరాలుగా తానా క్రీడలను నెక్ట్స్‌ లెవెల్‌ కి తీసుకెళ్లారు. TANANexGen  నినాదంతో ఎన్నో సరికొత్త క్రీడలకు అంకురార్పణ చేశారు. క్రీడాస్ఫూర్తిని ఇనుమడిరపజేస్తూ రెండు సంవత్సరాల్లో అమెరికా, ఇండియాలో కలిపి 45 క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. తానా క్రీడాలను సృజనాత్మక ఆలోచనలతో నెట్స్ట్‌ జనరేషన్‌ యువతిని తానా క్రీడాల్లో భాగస్వాములను చేస్తూ తానా వైపు తిప్పారు. 45 ఏళ్ళ తానా క్రీడల గతిని మార్చిన ది అన్‌ స్టాపబుల్‌  నెక్స్ట్‌ జనరేషన్‌ కార్యదక్షుడు శశాంక్‌ యార్లగడ్డ అనడం అతిశయోక్తి కాదు.

ఈ కార్యక్రమానికి సహకరించిన తానా అధ్యక్షులు నిరంజన్‌ శృంగవరపు, తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి, తానా బోర్డ్‌ చైర్మన్‌ డా. నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి, తానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్‌ మాజీ చైర్మన్‌ వెంకట రమణ యార్లగడ్డ, తానా మీడియా సమన్వయకర్త  సుమంత్‌ రామినేని, తానా ఫౌండేషన్‌ ట్రస్టీ శ్రీనివాస్‌ కూకట్ల, తానా క్రీడా కార్యదర్శి నాగ పంచుమర్తి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events