Skip to main content

Namaste NRI

తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాలలో..  గ్రీన్ ఇండియా ఛాలెంజ్  : మహేష్ బిగాల

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాలలో విస్తరించిందని బీఆర్‌ఎస్‌ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు.  ఈ సందర్భంగా  మహేష్ బిగాల మాట్లాడుతూ  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణానికి సంతోశ్​ కుమార్  చేస్తున్న కృషి అందరికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. సమస్త మానవజాతి మనుగడకు మొక్కలే జీవనాధారమని పేర్కొన్నారు. మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనం  పెరిగి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు.  ఎంపీ సంతోష్ కుమార్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (హరితహారం) ప్రచారంలో ప్రత్యేక ప్రతినిధి కావడం మంచి విషయన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం రేపటితో ఆరు వసంతాలు పూర్తి చేసుకోవడంతో పాటు, లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ చోటు లభించడం హర్షణీయమన్నారు. భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

Social Share Spread Message

Latest News