అమెరికాలోని ప్రముఖ నగరమైన లాస్ ఏంజెల్స్ మేయర్ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన నిత్యా రామన్ పోటీపడుతున్నారు. స్థానిక మౌలిక సదుపాయాలు, ప్రజా భద్రత, గృహ వసతి, ఉద్యోగాలు మరియు పర్యావరణం వంటి అంశాలను ప్రధాన అజెండాగా చేసుకొని ఆమె ఎన్నికల బరిలో నిలిచారు.

కేరళలో నిత్యా రామన్ 1981లో జన్మించారు. ఆమెకు ఆరేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. ప్రసిద్ధ హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన ఆమె, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్స్ డిగ్రీ పొందారు. 2020లో లాస్ ఏంజెల్స్ సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికై ఆమె రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.భర్త వాలీ చంద్రశేఖరన్ స్థానికంగా పేరొందిన టెలివిజన్ రచయిత, ప్రొడ్యూసర్. 2013లో లాస్ ఏంజెలెస్‌కు వెళ్లిన ఈ దంపతులు అక్కడే స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు, భారత్‌తోపాటు హాలీవుడ్‌లో అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి నిత్య పనిచేశారు. లాస్ ఏంజెల్స్ మేయర్ ఎన్నికల్లో ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌తో ఆమె పోటీపడుతున్నారు.















