Skip to main content

Namaste NRI

జెద్ధాలో ఎన్నారైల సెమీ క్రిస్మస్ వేడుకలు

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ పండుగ రోజు కంటే ముందుగా తెలుగునాట ఉభయ గోదావరి జిల్లాల్లో అంగరంగవైభవంగా నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకల తరహాలో గల్ఫ్ దేశాలలో కూడా ప్రవాసాంధ్ర క్రైస్తవులు క్రిస్మస్ వేడుకులను నిర్వహిస్తున్నారు. ఈ మెరకు సౌదీ అరేబియాలోని జెద్ధా నగరంలో తెలుగు క్రైస్తవ యువత ఇటీవల నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో వివిధ చోట్ల పని చేస్తున్న తెలుగు క్రైస్తవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రదర్ డానియల్ క్రిస్మస్ సందేశాన్ని ఇస్తూ ఏసు ప్రభు మార్గదర్శకం చేసినట్లుగా అందరూ సన్మార్గంలో నడవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనుషులు చెడు మార్గంలో పయనించడానికి చూపిస్తున్న ఆసక్తి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. మహేశ్, సైమర్ పీటర్‌లు భక్తి గీతాలను ఆలపించగా బ్రదర్ ఆనందరావు వచ్చిన అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతూ బహుమానాలు బహూకరించారు.

Social Share Spread Message

Latest News