Skip to main content

Namaste NRI

ఒబామా..భారత్‌ను విమర్శించడం మానుకోండి.. మాజీ కమిషనర్‌ సూచన

భారతీయ ముస్లింల హక్కుల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలపై ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యూఎస్ కమిషన్ మాజీ కమిషనర్ జానీ మూరే స్పందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భారత్ ను విమర్శించడం కంటే ఆ దేశాన్ని పొగడడానికే తన శక్తిని వెచ్చించాలని అన్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా భారతదేశాన్ని విమర్శించడం కంటే భారతదేశాన్ని మెచ్చుకోవడానికే ఎక్కువ శక్తిని వెచ్చించాలని నేను భావిస్తున్నాను. భారతదేశం మానవ చరిత్రలో అత్యంత వైవిధ్యమైన దేశం అని జానీ మూర్ అన్నారు.   

అమెరికా మాదిరిగానే భారతదేశం పరిపూర్ణ దేశం కాదని, వైవిధ్యమే దాని బలమన్నారు. అమెరికా పరిపూర్ణ దేశం కానట్లే భారత్ కూడా పరిపూర్ణ దేశం కాదని, దాని వైవిధ్యమే దాని బలం అన్నారు. ఒబామా ప్రధాని మోడీని అభినందించకుండా ఉండలేకపోయారన్నారు.

Social Share Spread Message

Latest News