Skip to main content

Namaste NRI

ఈ నెల 8న కథ కంచికి మనం ఇంటికి

ఆదిత్‌ అరుణ్‌, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న చిత్రం కథ కంచికి మనం ఇంటికి. ఈ సందర్భంగా నిర్మాత మోనిష్‌ పత్తిపాటి మాట్లాడుతూ కథ కంచికి మనం ఇంటికి కథ విన్నపుడే కొత్తగా ఆనిపించింది. హారర్‌, కామెడీ జానర్‌లో అనేక చిత్రాలు వచ్చినా, వాటికి భిన్నమైన సినిమా ఇది. అదిత్‌ అరుణ్‌, పూజిత పొన్నాడ జంట ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాగే ఆర్జే హేమంత్‌, గెటప్‌ శ్రీను మధ్య నడిచే కామెడీ ట్రాక్‌ ప్రత్యేక ఆకర్షణ. దర్శకుడు మాట్లాడుతూ కథనం వినోదాత్మకంగా ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా నిర్మాత సహకారంతో పూర్తి చేశామని తెలిపారు. మహేష్‌ మంజ్రేకర్‌, సప్తగిరి, వినోద్‌కుమార్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వై.యస్‌. కృష్ణ, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సంభాషణలు: శ్రీనివాస్‌ తేజ, చాణక్య చిన్న దర్శకత్వంలో మోనిష్‌ పత్తిపాటి నిర్మిస్తున్నారు. ఈ నెల 8న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News