Skip to main content

Namaste NRI

కొత్త సంవత్సరం సందర్భంగా.. ఉగాండాలో విషాదం

కొత్త సంవత్సరం వేళ  ఉగాండా రాజధాని కంపాలాలో విషాదం చోటుచేసుకున్నది. కంపాలాలోని ఫ్రీడమ్‌ సిటీ మాల్‌ కొత్త సంవత్సరం సందర్భంగా  బాణాసంచా విక్రయాలను చేపట్టింది. టపాసులు కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సిటీ మాల్‌కు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పలువురు కిందపడిపోయారు. పదుల సంఖ్యలో స్థానికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచాం. తొక్కిసలాటలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం పలువురిని స్థానిక దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. తొక్కిసలాటలో 9 మంది చనిపోయారు.    న్యూ ఇయర్ బాణాసంచా కాల్చేందుకు చాలా మంది ఒకేసారి పరుగు తీశారని పోలీసులు తెలిపారు. దీంతో మాల్‌లోని చిన్న హాలులో జనం కిక్కిరిసిపోయారు. గుంపులో చాలా మంది ఊపిరాడక కిందపడిపోయారు. ఇంత పెద్ద సంఖ్యలో జనం గుమికూడేందుకు కారకులెవరు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Social Share Spread Message

Latest News