Namaste NRI

అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా.. పుష్ప -2 ది రూల్‌ టీజర్‌

అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప -2 ది రూల్‌. రష్మిక మందన్న కథానాయిక. దర్శకుడు సుకుమార్. ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, ధనుం జయ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సోమవారం (ఏప్రిల్ 8న)  సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ స్టిల్‌లో ఫెరోషియస్‌గా, పవర్‌ఫుల్‌గా ఉన్న బన్నీని చూడొచ్చు. ఈ ఏడాది అల్లు అర్జున్‌కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.

ఈ ఏడాదే ఆయన జాతీయ ఉత్తమనటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ ఏడాదే ఆయన మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఏడాదే పుష్ప-2 కూడా రానుంది. ఈ సినిమాతో మరోసారి ఆయన నట విశ్వ రూపం చూస్తారని మేకర్స్‌ చెబుతున్నారు. ఆగస్ట్‌ 15న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలసిందే. ఈ చిత్రానికి కెమెరా: మిరోస్లా క్యూబా బ్రోజెక్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, దర్శకత్వం సుకుమార్‌.బి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress