Skip to main content

Namaste NRI

ఉగాది సంద్భంగా.. ఎఫ్ 3 నుంచి నవ్వుల హంగామా

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటిస్తున్న సినిమా ఎఫ్‌ 3. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎఫ్‌2కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఉగాది పండుగ సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మొత్తం కుటుంబ సభ్యులు, మిత్రులంతా ఈ పోస్టర్‌లో నవ్వుల హంగామా సృష్టిస్తున్నారు. ఎఫ్‌2లో భార్య బాధితులుగా కన్పించిన వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ చేతిలో మెగాఫోన్‌లు పట్టుకుని వారిని భయపెట్టడం ఆసక్తి సంతరించుకుంది. అనిల్‌ రావిపూడి అన్ని కమర్షియల్‌ హంగులతో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మొదటి పాటతో పాటు ఇప్పటి వరకు రిలీజ్‌ చేసిన ప్రమోషనల్‌ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. దిల్‌ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మొహరీన్‌, తమన్నా నాయికలు. రాజేంద్రప్రసాద్‌, సునీల్‌, సోనాల్‌ హౌహాన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా మే 27న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News