అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అధ్యక్ష అభ్యర్థిగా నిలిచిన కమలా హ్యారిస్‌పై మరోసారి నోరుపారేసుకున్నారు. కమలా హ్యారిస్ ఓ ఫ్రాడ్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఎక్స్‌లో పోస్ట్ చేసిన ర్యాలీకి సంబంధించిన ఫొటోల్లో కమలా హారిస్ కృత్రిమ మేథస్సు (ఏఐ)ని ఉపయోగించి జనం ఎక్కువగా ఉన్నట్లు చూపించారని ట్రంప్ ఆరోపించారు. మిచిగాన్ డెట్రాయిల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్ట్ వద్దకు మాకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్ట్ వద్ద చూపించిన జనాలకు సంబంధించిన ఫొటోలు నకిలీవని ఆరోపించారు. విమానాశ్రయం వద్ద ఎవరూ లేరని, ఏఐ టెక్నాలజీని వాడి భారీగా జనం ఉన్నట్లుగా చూపించారని, కమలా హ్యారిస్ కోసం ఎయిర్‌పోర్ట్ వద్ద ఎవరూ ఎదురుచూడలేదన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఇలా మోసం చేసి ఎన్నికల్లో గెలుస్తారని విమర్శించారు.