అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ సాయుధుడి తూటాలకు ఐదుగురు పౌరులు దుర్మరణం చెందారు. ఈ ఘటన కెంటకీలోని లూయిస్‌విల్లేలోని ఓ బ్యాంకు వద్ద జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా ఆరుగురు గాయపడ్డారు. ఓల్డ్ నేషనల్ బ్యాంక్ మొదటి అంతస్థులోని సమావేశ మందిరంలో కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తి పొడవాటి తుపాకీతో పాటు పలు ఆయుధాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని మట్టుబెట్టారు. అయితే, కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదని అధికారులు చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-36.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/4b3127df-f30c-4f25-9c19-7ecfdbd57b90-51-38.jpg)