Namaste NRI

ఐదో వంతు భారతీయులకే … ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌లకే అధికం

అమెరికా జారీ చేసిన హెచ్‌1బీ వీసాలలో ఐదో వంతు భారత్‌కు చెందిన టెక్‌ కంపెనీలు దక్కించుకున్నాయి. అందు లో ఇన్ఫోసిస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌)లకు ఎక్కువ వీసాలు లభించాయని యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ శాఖ ప్రకటించింది. 2024 సెప్టెంబర్‌ నాటికి 1.3 లక్షల హెచ్‌1బీ వీసాలు జారీ కాగా, అందులో 24,766 భారత్‌కు చెందిన వివిధ కంపెనీలకు లభించాయి.

ఇందులో ఇన్ఫోసిస్‌కు 8,140, టీసీఎస్‌కు 5,274, హెచ్‌సీఎల్‌కు 2,953 వీసాలు దక్కాయి. మొత్తంపై అమెజాన్‌ కామ్‌ సర్వీసెస్‌ ఎల్‌ఎల్‌సీకి అత్యధికంగా 9,265 దక్కగా రెండో స్థానంలో ఇన్ఫోసిస్‌, 6,321తో కాగ్నిజెంట్‌ మూడో స్థానంలో నిలిచాయి. భారత్‌కు చెందిన విప్రోకు 1,634, టెక్‌ మహీంద్రాకు 1,199 వీసాలు మంజూరయ్యాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలు తమ సంస్థలలో విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి ఈ హెచ్‌1బీ వీసాలను జారీ చేస్తారు. ఈ వీసాల ద్వారా భారత్‌, చైనాకు చెందిన టెక్‌ నిపుణులు ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events