Skip to main content

Namaste NRI

వీరభద్రుడు లాంటి క్యారెక్టర్‌ను అన్నయ్య మాత్రమే చేయగలడు : కార్తి

సూర్య హీరోగా రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వీరభద్రుడు. త్రిష కథానాయిక. ఆర్జే బాలాజీ దర్శకుడు. ఎస్‌ఆర్‌ ప్రభు, ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సూర్య మాట్లాడారు. నాకు తెలుగు రాకపోయినా, తెలుగువారి మనసు బాగా తెలుసు. వీరభద్రుడు నిజంగా అద్భుతమైన ప్రయాణం. తెలుగు కంటెంట్‌ని రాకేందుమౌళి అద్భుతంగా రాశారు. దర్శకుడు ఆర్జే బాలాజీ మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌. తను నిజాయితీగా ఈ సినిమా తీశాడు. తను కథ చెబుతుంటే వీరభద్రుడు పూనినట్టు అనిపించింది. నిజంగా కూడా తను దేవుడ్ని బాగా నమ్ముతాడు. ఈ స్క్రిప్ట్‌లో అది కనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌ ఎమోషనల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామాగా, సెకండాఫ్‌ మాస్‌ మాసాలా ఎలిమెంట్స్‌తో జాతరని మరిపించేలా సినిమా ఉంటుంది. త్రిషతో పాటు గ్రేట్‌ ఆర్టిస్టులు ఇందులో నటించారు. గొప్ప టెక్నీషియన్స్‌ వర్క్‌ చేశారు. ఈ నెల 14న వస్తున్నాం. మీ ప్రేమ కావాలి అని అన్నారు.

అతిధిగా విచ్చేసిన హీరో కార్తి మాట్లాడుతూ ట్రైలర్‌ చూస్తుంటే గజనీ సూర్యని చూస్తున్నట్టుంది. ఇది మాస్‌ మసాలా సినిమానే కాదు, ఫ్యామిలీ సినిమా కూడా. కొన్ని సీన్లు చూశాను. అవి అన్నయ్య మాత్రమే చేయగలరు. ఎంత బరువైన పాత్రనైనా ఆయన మోస్తాడు. ఇది థియేటర్లోనే చూడాల్సిన సినిమ అన్నారు. ఇంకా డైరెక్టర్‌ ఆర్జే బాలాజీ, నిర్మాత సుప్రియ యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events