Namaste NRI

 ఆర్డర్‌ కాదురా.. ఆఫర్‌ : విశాల్‌

విశాల్‌ కథానాకుడిగా నటిస్తున్న చిత్రం లాఠీ. ఏ. వినోద్‌ కుమార్‌ దర్శకుడు. రానా ప్రోడక్షన్స్‌ పతాకంపై రమణ, నంద నిర్మిస్తున్నారు.   థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.  మీలాంటి  వాళ్లని చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే ఆది మాకు పై అధికారులు ఇచ్చే ఆర్డర్‌ కాదురా ఆఫర్‌ అని విశాల్‌ చెప్పే  డైలాగ్‌తో లాఠీ చిత్రం ట్రైలర్‌ సాగుతుంది. ఇందులో నిజాయితీ కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా విశాల్‌ కనిపించారు.  వ్యవస్థలోని అన్యాయాల్ని ప్రశ్నించే  డాషింగ్‌ పోలీసాఫీసర్‌గా ఆయన పాత్ర పవర్‌ఫుల్‌ సాగింది. కర్తవ్య నిర్వహణలో సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌కు ఎదురైన  సవాళ్లేమిటన్నదే చిత్ర కథాంశం. యాక్షన్‌తో పాటు ఫ్యామిలి సెంటిమెంట్‌ కూడా ఉంటుంది అని దర్శకుడు తెలిపారు.  సునైనా కథానాయికగా నటిస్తుంది.  ఈ చిత్రానికి కెమెరా : బాలసుబ్రమణియన్‌, సంగీతం: యువన్‌శంకర్‌ రాజా,  రచన,పొన్‌ పార్థిబస్‌,ద్శకత్వం : ఏ.వినోద్‌ కుమార్‌. ఈ చిత్రాన్ని ఈ నెల 22న రిలీజ్‌ చేయనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events