Skip to main content

Namaste NRI

సోల్‌ ఆఫ్‌ జటాధార కి రెస్పాన్స్‌ అదుర్స్‌

సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్‌ నాచురల్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ జటాధర. వెంకట్‌ కల్యాణ్‌, అభిషేక్‌ జైస్వాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పౌరాణిక ఇతివృత్తాలతో గ్రేట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ సినిమా అందివ్వబోతున్నదని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఫస్ట్‌ ట్రాక్‌ సోల్‌ ఆఫ్‌ జటాధర ను మేకర్స్‌ విడుదల చేశారు.

సాంప్రదాయ సంగీతం, డివైన్‌ టచ్‌తో కూడిన ఈ స్వరాలు జటాధర ప్రపంచంలోకి తీసుకెళ్లాలా ఉంటాయని, ముఖ్యంగా ఓం నమఃశివాయ జపం గూజ్‌బంప్స్‌ తెప్పిస్తుందని, సంగీత దర్శకుడు రాజీవ్‌రాజ్‌ స్వరపరచి, స్వయంగా ఆలపించిన ఈ ఆడియో గ్లింప్స్‌ అందర్నీ ఆకట్టుకుంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్‌, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్‌, నవీన్‌ నేని, రోహిత్‌ పాఠక్‌, ఝాన్సీ తదితరులు చిత్ర తారాగణం. నవంబర్‌ 7న ఈ సినిమా విడుదల కానుంది. సుధీర్‌ బాబు ఇక తన ఆశలన్నీ జటాధర ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌ సినిమాపైనే పెట్టుకున్నాడు.

Social Share Spread Message

Latest News