మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యవర్గ ఎన్నికలు సెప్టెంబరు 12న జరపాలని నిర్ణయించారు. ప్రముఖ నటుడు కృష్ణంరాజు నేతృత్వంలోని క్రమశిక్ష కమిటీ ఆధ్వర్యంలో వర్చువల్ సమావేశం జరిగింది. మూడు గంటలపాటు చర్చించిన అనంతరం ఆగస్టు 22న సర్వసభ్య సమావేశం ఖరారు చేశారు. సెప్టెంబర్ 12ని ఎన్నికల తేదీగా నిర్ణయించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆ లోపు మరోసారి కార్యవర్గం సమావేశమై ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపింది.