Skip to main content

Namaste NRI

పాకిస్థాన్ కే మా మద్దతు : జిన్ పింగ్

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చైనాలో పర్యటిస్తున్నారు. తన పర్యటన చివరి రోజున చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌తో భేటీ అయ్యారు. పాకిస్థాన్‌ జాతీయ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, గౌరవం, తీవ్రవాదంపై పోరుకు తమ మద్దతు ఉంటుందని ఇమ్రాన్‌తో జిన్‌ పింగ్‌ చెప్పినట్లు తెలిసింది. చైనా`పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (ఈపీఈసీ)ను ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్‌ అంశాన్ని శాంతియతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చైనా మద్దతునిస్తున్నట్టు అక్కడి అధికార యంత్రాంగం పేర్కొంది. ఏకపక్ష చర్యలు పరిస్థితిని తీవ్రతరం చేస్తామని, వీటిని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. శాంతియుత, సౌభాగ్య దక్షిణాసియా అన్నది ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షగా సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Social Share Spread Message

Latest News