ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి (ఎన్టీఆర్) 103వ జయంతిని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ టీము నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి ప్రారంభించి మాట్లాడారు. ప్రాణాలను కాపాడే ఈ గొప్ప కార్యక్రమానికి 40 మందికి పైగా దాతలు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. రక్తదానం గొప్పతనాన్ని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు తానా మిడ్-అట్లాంటిక్ బృందాన్ని, మిడ్ అట్లాంటిక్ రీజినల్ రిప్రజంటేటివ్ ఫణి కంతేటిని, స్వచ్ఛంద సేవకులను మరియు దాతలను ఆయన అభినందించారు. అలాగే, 50 సార్లకు పైగా రక్తదానం చేసి అరుదైన మైలురాయిని అందుకున్న రంజిత్ కోమటిని ప్రత్యేకంగా అభినందించడంతోపాటు ఘనంగా సత్కరించారు.


తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి కూడా టీమ్ సేవను ప్రత్యేకంగా ప్రశంసించారు.మే 31వ తేదీన ఎక్స్‌టాన్ లో మిడ్ అట్లాంటిక్ టీము నిర్వహించిన బ్లడ్ డ్రైవ్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఈ బ్లడ్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతోమంది ముందుకు వచ్చారు. వారిలో మొదటిసారి రక్తదానం చేస్తున్నవారు కూడా ఉన్నారు. కాగా ఈ కార్యక్రమానికి వేదికను ఉచితంగా అందించిన వేణు సంగనికి, కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటును అందించిన బ్లడ్ బ్యాంక్ ఆఫ్ డెల్మార్వా బృందానికి తానా నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి గ్రాండ్ స్పాన్సర్ గా స్ప్రూస్ ఇన్ఫోటెక్ వ్యవహరించింది. ప్రీమియం స్పాన్సర్‌గా టెస్లా రియాల్టీ గ్రూపు, తనిష్క్ యుఎసఎ, చు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓక్స్టన్, స్ప్రింగ్ ఈగిల్స్, రియల్ ప్రాపర్టీ మేనెజ్ మెంట్ వారణాసి కంపెనీలు కూడా ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించాయి.


ఈ కార్యక్రమంలో సురేష్ యలమంచి, భవాని క్రొత్తపల్లి, శైలజ కస్తూరి, సరోజ పావులూరి, విశ్వనాథ్ కోగంటి, రంజిత్ మామిడి, శ్రీధర్ సాదినేని, శ్రీనివాస్ అబ్బూరి, హరి, గౌరి కర్రోతు, నాగరాజ్, కోటి యాగంటి, శ్రీకాంత్ గుడూరు, ప్రసాద్ కునారపు, రమణ కోత, మధు నల్ల పాల్గొన్నారు.
































