Namaste NRI

మార్చి 30న పరారి  గ్రాండ్ రిలీజ్

యోగేశ్వర్‌, అతిథి జంటగా నటిస్తున్న చిత్రం పరారి.  సాయిశివాజీ దర్శకుడు. జీవీవీ గిరి నిర్మించారు. ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన కాంగ్రెస్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ నటులు సుమన్, ప్రసన్న కుమార్ లు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయగా , దర్శకులు చంద్ర మహేష్, నిర్మాత తుమ్మల పల్లి రామసత్య నారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్ లు థియేట్రికల్ ప్రోమో ను విడుదల చేశారు.నటి కవిత సాంగ్ ప్రోమో ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్స్ సి. హెచ్ హనుమంత రావు(మాజీ రాజ్య సభ) , గాలి అనిల్ కుమార్, రవతు కనకయ్య, పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొని చిత్ర హీరో యోగేశ్వర్ గబర్త్ డే సెలెబ్రేషన్ గ్రాండ్ గా జరిపి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ  ఈ చిత్రానికి మహిత్‌ అద్భుతమైన సంగీతాన్నందించాడు. వినూత్న కథతో వినోద ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది అన్నారు. హీరోగా తనకిది తొలి చిత్రమని, వైవిధ్యమైన కథలో నటించడం ఆనందంగా ఉందని యోగేశ్వర్‌ తెలిపారు. ఆద్యంతం వినోదప్రధానంగా ఈ చిత్రం మెప్పిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. సుమన్‌, భూపాల్‌, శివాని సైని, రఘు కారుమంచి, షాయాజీషిండే తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 30న విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News