Namaste NRI

పఠాన్ మూవీ  ప్రభంజనం.. రిపబ్లిక్ డే రోజున

పఠాన్ మూవీ  బాక్సాఫీస్ వద్ద  ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. రిపబ్లిక్ డే రోజున జనవరి 26న పఠాన్ దేశవ్యాప్తంగా రూ. 70 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీపికా పడుకునె, జాన్ అబ్రహం ఇతర ప్రధాన తారాగణంతో తెరకెక్కిన పఠాన్ రెండవ రోజు కలెక్షన్లను భారీగా రాబట్టింది. 65 శాతం ఆక్యుపెన్సీతో మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ తేడా లేకుండా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తమిళ్, తెలుగు డబ్బింగ్ వెర్షన్ల నుంచి మరో రూ. 3 కోట్ల వసూళ్లు సమకూరాయి. ఇక రెండు రోజుల్లో పఠాన్ ప్రపంచవ్యాప్తంగా రూ . 235 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టింది. ఈ మూవీకి సిద్ధార్ధ్ ఆనంద్ కధ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్ధ యష్రాజ్ పిల్మ్స్ నిర్మించింది.

Social Share Spread Message

Latest News