Namaste NRI

పెదకాపు వస్తున్నాడు

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందిస్తున్న న్యూఏజ్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ పెదకాపు-1. విరాట్‌ కర్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ చిత్రంలో  నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగడసాగ, రాజీవ్‌ కనకాల తదితరులు నటిస్తున్నారు.  ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అణచివేత, సంఘర్షణల నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. ఓ సామాన్యుడు ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఏమిటన్నదే చిత్ర ఇతివృత్తం. పవర్‌ఫుల్‌ యాక్షన్‌, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె నాయుడు, సంగీతం: మిక్కీ జే మేయర్‌, రచన-దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events