Namaste NRI

పశ్చిమబెంగాల్ వ్యక్తి జాక్ పాట్.. లాటరీలో

పశ్చిమబెంగాల్‌లోని తూర్పు బర్ధమాన్‌ జిల్లాకు చెందిన షేక్‌ హీరా అంబులెన్స్‌ డ్రైవర్‌కు లాటరీ రూపంలో అదృష్టం వరించింది. గంటల వ్యవధిలోనే కోటీశ్వరుడు అయిపోయాడు. రూ.270 పెట్టి ఉదయం లాటరీ టికెట్టు కొన్న అతను మధ్యాహానికి రూ.కోటి. జాక్‌పాట్‌ కొట్టేశాడు. ఇంత భారీ మొత్తంలో డబ్బు గెలుచుకోవడం షాక్‌కు గురైన హీరా అభ్యర్థన మేరకు శక్తిఘర్‌ పోలీసులు అతని ఇంటి బయట భద్రత ఏర్పాటు చేశారు. గెలుచుకున్న డబ్బుతో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి వైద్యం చేయిస్తానని, కొత్త ఇంటిని నిర్మించుకొంటానని షేర్‌ హీరా తెలిపారు. అనేక రోజులుగా లాటరీ టికెట్లు కొంటున్నానని, ఈ రోజుకు అదృష్టం తన తలుపు తట్టిందని ఆనందం వ్యక్తం చేశాడు.

Social Share Spread Message

Latest News