Namaste NRI

యాచారంలో ఫార్మాసిటీ ఏర్పాట్లు…భారీగా పెరిగిన భూముల ధరలు

అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌ ఫార్మాసిటీ ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. భూసేకరణను వేగవంతం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేయన్ను హైదరాబాద్‌ ఫార్మాసిటీకి భూసేకరణ జరుగుతోంది. 19,046.25 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కోసం ఇప్పటికే 8,176.24 ఎకరాలు సేకరించారు. వీటిలో 5,942.32 ఎకరాలు ప్రభుత్వ భూములు కాగా 2,223.32 ఎకరాలు పట్టా భూములు ఉన్నాయి. మరో 267 ఎకరాల బిల్‌ ల్యాండ్‌ భూములు తీసుకున్నారు.

                ఐటీ రంగం తర్వాత అత్యధిక మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది ఫార్మా రంగమే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫార్మాసిటీ ఆర్‌ఆర్‌ఆర్‌కు సమీప దూరంలోనే ఉండటంతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రెండు జాతీయ రహదారులకు అనుసంధానమై ఉంది. దీంతో ఈ హైవే ప్రాంతంలో రియల్‌ బూమ్‌ పరుగెడుతోంది. కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ అభివృద్ధితో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ నగరం ప్రఖ్యాతిగాంచింది. ఇప్పటికే నగరంలో 50 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 800లకు పైగా లైఫ్‌సైన్స్‌ కంపెనీలు ఉన్నాయి. యాచారం, ముచ్చర్ల, కందుకూర్‌, కడ్తాల్‌ మండలాల పరిధిలో 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీ విస్తరించి ఉంటుంది. ఇందులో 50 ఎకరాలలో లైఫ్‌సైన్సెస్‌ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 600 ఎకరాల్లో టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే చర్యలు చేపట్టింది.

                ఏ ప్రాంతంలోనైనా సరే పారిశ్రామిక అభివృద్ధి జరిగితే దానిచుట్టూ 30 కి.మీ. వరకు రెసిడెన్షియల్‌ డెవలప్‌మెంట్‌ జరుగుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ హైటెక్‌ సిటీనే. రెండు దశాబ్దాల క్రితం మాదాపూర్‌లో ఐటీ కంపెనీల ఏర్పాటుతో కొండాపూర్‌ గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు ఎలాగైతే అభివృద్ధి జరిగిందో సేమ్‌ అలాంటి అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఫార్మాసిటీ ప్రాజెక్ట్‌ మారనుందని సమూహా ప్రాజెక్టు ఎండీ మల్లికార్జున కుర్రా తెలిపారు. ఫార్మాసిటీ కొలువుదీరనున్న మండలాలలో యాచారం మండలం ఒకటి. ఈ ప్రాంతం అమెజాన్‌ డేటా సెంటర్‌తో పాటు ఎలిమినేడు ఏరోస్సేస్‌, ఆధిభట్ల, ఐటీ హబ్‌, ఇబ్రహీంపట్నం బీడీఈఎల్‌ కంపెనీలకు చేరువలో ఉంది. దీంతో ఈ ప్రాంతం భవిష్యత్తులో మరొక ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌గా అభివృద్ధి చెందటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.

                రీజినల్‌ రిండ్‌ రోడ్‌ యాచారం మీదుగా వెళుతుండటంతో ఈ ప్రాంతంలో భూములు ధరలు ఇప్పుడు బాగా పెరిగాయి. గతంలో ఎకరం రూ.75`80 లక్షలు ఉండగా, ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రకటనతో కోటిన్నరకు పైగానే చెబుతున్నారని కొందరు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతికదూరం అనివార్యమైంది. దీంతో ప్రధాన నగరంలో ఇరుకిళ్ల మధ్య ఉంటూ ఇబ్బందులు పడే బదులుగా నగరానికి దూరమైన సరే పచ్చని, ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఓఆర్‌ఆర్‌, మైట్రోలతో శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరానికి ప్రయాణం సులువైంది. కాబట్టి దూరమైన సరే ప్రశాంత వాతావరణంలో ఉండాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో అభివృద్ధికి ఆస్కారం ఉండే ప్రాంతాలు, తక్కువ సమయంలోనే పెట్టిన పెట్టుబడి రెట్టింపయ్యే ప్రాంతాలలో స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తున్నారు.

Sri Mallikarjun Kurra
Managing Director
Samooha Projects

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events