యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసి వివాహ జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లి వేడుక బుధవారం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు, వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ సినిమాల్లో నటిస్తున్నారు.




















