Namaste NRI

భార‌తీయ సంత‌తి వ్య‌క్తి దాతృత్వం.. 176 మంది విద్యార్థులకు

అమెరికాలోని నార్త్ క‌రోలినా స్టేట్ యూనివ‌ర్సిటీకి చెందిన విల్స‌న్ కాలేజ్ ఆఫ్ టెక్స్‌టైల్స్ విద్యార్థులను భార‌తీయ సంత‌తి వ్య‌క్తి స‌ర్‌ప్రైజ్ చేశారు. ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న 176 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థుల రుణాలు చెల్లించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ర‌లేగ్‌లోని రేనాల్డ్స్ కొలేషియంలో గ్రాడ్యుయేష‌న్ సెర్మ‌నీ జ‌రిగింది. భార‌తీయ వ్య‌క్తి అనిల్ కొచ్చార్ త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. త‌న తండ్రి ప్ర‌కాశ్ చాంద్ కొచ్చార్ జ్ఞాప‌కంగా విద్యార్థుల రుణాల‌ను చెల్లిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. పంజాబ్‌కు చెందిన త‌న తండ్రి, ర‌లేగ్‌కు వ‌ల‌స వ‌చ్చిన‌ట్లు ఆయ‌న ఆ సెర్మ‌నీలో మాట్లాడుతూ వెల్లించారు. విల్స‌న్ కాలేజీలో ఫైన‌ల్ ఇయ‌ర్ గ్రాడ్యుయేష‌న్ చ‌దువుతున్న విద్యార్థులంద‌రికీ గిఫ్ట్ ఇస్తున్నాన‌ని, 2025-26 అకాడ‌మిక్ సంవ‌త్స‌రానికి చెందిన విద్యార్థుల ఫీజుల‌ను చెల్లించ‌నున్న‌ట్లు చ‌రెప్పారు. మారిలిన్ తాను క‌లిసి ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, స్వేచ్ఛ‌గా మీరు మీ డిగ్రీని పొందాల‌ని, మీ ల‌క్ష్యాల‌ను మీరు చేరుకోవాల‌ని, దేని కోసం క‌ష్ట‌ప‌డ్డారో ఆ జీవితాన్ని నిర్మించుకోవాల‌ని అనిల్ త‌న ప్ర‌సంగంలో తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events