Skip to main content

Namaste NRI

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

హిందీ చిత్రం పింటు కీ పప్పీ తెలుగులో కిస్‌ కిస్‌ కిస్సిక్‌ పేరుతో రిలీజ్‌ కానుంది. సుశాంత్‌, జాన్యాజోషి జంటగా నటించిన ఈ చిత్రానికి శివ్‌ హరే దర్శకత్వం వహించారు. విధి ఆచార్య నిర్మాత. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. ఈ నెల 8న ట్రైలర్‌ విడుదలకానుంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇదని, పింటు అనే యువకుడి ప్రేమ ప్రయాణంలో ఎదురైన సంఘటనలను హాస్య ప్రధానంగా ఆవిష్కరిస్తుందని దర్శకుడు తెలిపారు.  ఈ నెల 21న హిందీతో పాటు దక్షిణాది భాషల్లో విడుదలకానుంది.  విజయ్‌రాజ్‌, మురళీశర్మ, సునీల్‌ పాల్‌, అలీ అస్గర్‌ తదితరులు చిత్ర తారాగణం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events