Namaste NRI

దయచేసి ఇక నుండి నన్ను అలా పిలవొద్దు :  నయనతార

మీ ప్రేమ నాకు చెప్పలేనంత సంతోషాన్నిస్తుంది. ఈ ఆనందం కలకాలం ఉండాలని కోరుకుంటున్నా. మీరు ప్రేమతో నన్ను లేడీ సూపర్‌స్టార్‌  అని పిలుస్తున్నారు. అలా పిలవడం సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నప్పటికీ ఎందుకో కంఫర్ట్‌గా ఉండలేకపోతున్నా. అందుకే,  దయచేసి నన్ను లేడీ సూపర్‌స్టార్‌ అని పిలవొద్దు. నయనతార అని పిలవండి చాలు  అంటూ బహిరంగ లేఖ రాశారు అగ్ర నటి నయనతార. ఇటీవల ధనుష్‌తో గొడవ, కోర్టు కేసుల నేపథ్యంలో నయనతార వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమె నుంచి ఈ లేఖ రావడం చర్చనీయాంశమైంది.

ఇంకా ఆ లేఖలోకి వెళితే నయనతార అనే పేరు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. అదే నేనెవరో నాకు చెబుతుంటుంది. బిరుదులు, పొగడ్తలు, ప్రశంసలు వెలకట్టలేనివే,  కాదనను. కానీ కొన్ని సార్లు అవి మనల్ని కంఫర్ట్‌గా ఉండనివ్వవ్‌. మీ అభిమానం ఉంటే చాలు. సినిమా మనందర్నీ ఒకటిగా ఉంచుతుంది. నయనతార మాత్రం ఎప్పటికీ నయనతారే అని పేర్కొన్నారు నయన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events