Skip to main content

Namaste NRI

నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ

భారత ప్రధాన మంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వరసగా ప్రధాని పదవిలో అత్యధిక కాలం కొనసాగిన వ్యక్తిగా జవహర్‌లాల్‌ నెహ్రూ సాధించిన రికార్డును నరేంద్ర మోదీ అధిగమించారు. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 1964 వరకు పదవిలో కొనసాగిన నెహ్రూ ఇప్పటికీ దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచి ఉండగా మోదీ మద్దతుదారులు మాత్రం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలైన 1952 నాటి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతే నెహ్రూ పదవీకాలం ప్రారంభమైందని వాదిస్తున్నారు.

జవహర్‌లాల్‌ నెహ్రూ (1947-1964): 16 ఏండ్ల 86 రోజులు
నరేంద్ర మోదీ (2014-కొనసాగుతున్నారు): 12 సంవత్సరాలు
ఇందిరా గాంధీ (1966-1977, 1980-1984): రెండు పర్యాయాలు కలిపి 16 సంవత్సరాలు
మన్మోహన్‌ సింగ్‌ (2004-2014): 10 సంవత్సరాలు
అటల్‌ బిహారీ వాజ్‌పేయి (1996,1998-2004): మూడు పర్యాయాలు కలిపి ఆరు సంవత్సరాలకు పైగా
రాజీవ్‌ గాంధీ (1984-1989): 5 సంవత్సరాలు
పీవీ నరసింహారావు (1991-1996): 5 సంవత్సరాలు.

Social Share Spread Message

Latest News