Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టుకు రంగం సిద్ధం ?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ పో స్టార్‌కు భారీగా నగదు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడనే నేరారోపణలకు గానూ ఆయన్ని అరెస్ట్‌ చేసే అవకాశం ఉందట.  ఈ మేరకు మాన్‌హట్టన్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయం నుంచి స్పష్టమైన సంకేతాలు అందినట్లు ట్రంప్‌ స్వయంగా వెల్లడిరచారు.  వచ్చే వారంలో బహుశా తాను అరెస్ట్‌ కావొచ్చని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌  సోషల్‌ ట్రూత్‌ ద్వారా వెల్లడిరచారు. 2016 ఎన్నికలకు ముందు ఓ పో స్టార్‌కు భారీగా డబ్బులు ఇచ్చి ఒప్పందం చేసుకున్నారనే అభియోగాలపై ఇప్పటికే దర్యాప్తు సంస్థల విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై నేరారోపణలు నమోదు చేసి అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన అరెస్ట్‌ సంకేతాల నేపథ్యంలో మద్దతుదారులంతా నిరసనలకు సిద్దం కావాలని పిలుపు ఇచ్చారు ట్రంప్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events