75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారత్‌కు అమెరికా ప్రధాని జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగి ఉందని ప్రశంసించారు. 1947 ఆగస్ట్ 15న మహాత్మాగాంధీ ఇచ్చిన సందేశం సత్యం, అహింస అనే మార్గ నిర్దేశాల ద్వారా సుదీర్ఘ ప్రయాణంతో భారత్ స్వాతంత్య్రాన్ని సాధించిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం ద్వారా ప్రజల ఇష్టాలను గౌరవించడమనే నిబద్ధత ప్రపంచానికి స్పూర్తినిస్తోందని అన్నారు. ఇదే ఇరు దేశాల మధ్య ప్రత్యేక బంధానికి ఆధారమని బైడెన్ ట్వీట్ చేశారు.
దశాబ్దాలుగా అమెరికన్ పౌరులకు, నాలుగు మిలియన్‌ల ఇండో అమెరికన్‌ల మధ్య సంబంధాలతో భారత్‌తో భాగస్వామ్యన్ని కొనసాగించాయని, బలోపేతం చేశాయని అన్నారు. ఇరు దేశాల గొప్పవైన, విభిన్నమైన ప్రజాస్వామ్యాలు ప్రజలకు అవకాశాలు అందించగలవని మనం ప్రపంచానికి చూపించాలని అన్నారు. అలాగే మన దేశాల మధ్య స్నేహం వృద్ధి చెందుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ రోజు భారత్, అమెరికా, ప్రపంచ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.