Namaste NRI

ప్రధాని మోదీ తనకు హామీ… ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని, ఈమేరకు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్‌ చెప్పారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి రష్యాను ఒంటరిని చేయడంలో ఇదొక కీలక అడుగని అభివర్ణించారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

రష్యా నుంచి భారత్‌ చమురును దిగుమతి చేసుకోవడంపై ప్రధాని మోదీ వద్ద తాను ఆందోళన వ్యక్తం చేశానని ట్రంప్‌ చెప్పారు. మాస్కో నుంచి భారత్‌ చమురు కొనడం వల్ల ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగించేందుకు పుతిన్‌ ఆ నిధులు ఉపయోగిస్తున్నారని అమెరికా భావిస్తున్నదని తెలిపారు. ఈ కొనుగోళ్లపై తాను సంతోషంగా లేనని చెప్పాను. ఈ సందర్భంగా ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ప్రధాని మోదీ ఈరోజు తనకు హామీ ఇచ్చారని. ఇదొక కీలక ముందడుగు అని చెప్పారు.

Social Share Spread Message

Latest News