నగదు రహిత చెల్లింపుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చింది. దేశంలో నగదు రహిత ఈ`రూపీ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నగదు రహిత, కాంటాక్ట్ లెస్ ఆర్థిక లావాదేవీల కోసం ఈ `రూపీ విధానానికి రూపకల్పన చేశారు. ప్రజలకు ఈ`రూపీ విధానం అందుబాటులోకి వస్తోంది. ఈ విధానంలో చెల్లింపులు ఎలా ఉంటాయంటే.. మొబైల్ ఫోన్‌కు ఈ`రూపీ క్యూఆర్ కోడ్, ఎస్సెమ్మెస్ స్ట్రింగ్ ఓచర్ వస్తాయి. ఈ రెండిరటి సాయంతో చెల్లింపులు జరపవచ్చని, ఇది ఎంతో సురిక్షితమైన విధానం అని కేంద్రం వెల్లడిరచింది. ఇంటర్నెంట్ బ్యాంకింగ్, కార్డులు, యాప్ లతో సంబంధం లేకుండా లావాదేవీలు జరపవచ్చని వివరించింది. ప్రస్తుతం 8 బ్యాంకుల ద్వారా ఈ`రూపీ సేవలు అందించనున్నారు.